అన్ని విభాగాల్లో అగ్రగామిగా దూసుకుపోతున్న చెన్నై మరోసారి వార్తలో నిలిచింది. ఈ ప్రాంతానికి చెందిన టాబ్లెట్ కంప్యూటర్ల తయారీ కంపెనీ ఐబెర్రీ ‘ఆక్సస్ ఏఎక్స్01’ మోడల్‌లో ఆండ్రాయిడ్ ఐసీఎస్ ఆధారిత వై-ఫై టాబ్లెట్‌ను డిజైన్ చేసింది. జూలై మొదటి వారంలో ఈ కంప్యూటింగ్ గ్యాడ్జెట్‌ను ఆవిష్కరించనున్నారు. ధర రూ.5,990. ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్స్ లేదా ఎంపిక చెయ్యబడిన రిటైల్ అవుట్ లెట్‌ల ద్వారా ఆక్సస్ ఏఎక్స్01ను సంవత్సరం వారంటీతో కొనుగోలు చెయ్యవచ్చు.
ఫీచర్లు:
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,
మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసర్,
7 అంగుళాల టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్) ,
1జీబి డీడీఆర్3 ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రో ఎస్‌డి కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకోవచ్చు,
మినీ హెచ్‌డిఎమ్ఐ పోర్టు,
1080 పిక్సల్ హై డెఫినిషన్ వీడియో ప్లేబ్యాక్.
0 comments:
Post a Comment